ఏ పిల్లలకైనా తల్లిదండ్రులే రోల్ మోడల్స్ మనకు ఎలాంటి అలవాట్లు ఉంటాయో వాళ్ళు అవే నేర్చుకుంటారు.ఉదాహరణకు మనకు కోపం వస్తే అరిచి ఇతరుల పై పడిపోతే పిల్లలు గట్టిగా అరవడం కోపం ప్రదర్శించే మార్గం అనుకుంటారు.ఒక వేళ ఇంట్లో పిల్లలు కోపిష్టిగా మారుతుంటే పెద్దవాళ్ళు వాళ్ళను దారి మళ్ళించాలి.ముందుగా వాళ్ళ కోపం తగ్గేవరకు మౌనంగా ఉండాలి.ఆ నిమిషం వాళ్ళ పైన అరుస్తూ నిందిస్తే తప్పే  ఆ కోపాన్ని వాళ్ళు మన దగ్గరే నేర్చుకున్నారు. వారి దృష్టి మరల్చే ఏ పనైనా చేయాలి. వాళ్ళను కాసేపు బయటకు తీసుకుపోయి కోపం వల్ల కలిగే నష్టాలు పిల్లలకు అవకాశం వచ్చినప్పుడల్లా చెప్పాలి. అది ఆరోగ్యానికి ఎలా హాని చేస్తుందో చెప్పాలి. కోపంతో ఏ పని పరిష్కరించలేమని దాని వల్ల ఇంకొన్ని కొత్త ఇబ్బందులు ఎలా వస్తాయో ప్రశాంతంగా చెబితే పిల్లలు అర్ధం చేసుకుంటారు.

Leave a comment