నీహారికా , ఇప్పుడు రెండు వేమన పద్యాల్లోని ఒక్క లైను చెపుతూ కోపముండు బతుకు కొంచమై పోవును. ఇదొక పద్యం లోది. శాంతభావ మహిమ చర్చించ లేమయా. ఇది ఇంకో పద్యంలోని లైవ్. ఎంచెపుతున్నాడంటే కోపం వలన మనిషి తన వివేకాన్ని ఆలోచననీ కోల్పోతున్నాడు. పరాజయానికి కారణం విశ్లేషించుకోలేడు. అంచేత ఎంతటి విద్యావంతుడైన కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే అందరినీ దూరం చేసుకుంటాడు అని. అలాగే శాంతం వలన మనిషి తన ఆలోచనలు అదుపులో వుంచుకోగలుగుతాడు. అన్నింటా జయం కలుగుతోంది. శాంత స్వభావి ప్రజల మన్నన పొందుతాడు అవి, పదకొండవ శతాబ్దపు దక్షిణ భారత దేశపు సంఘ సంస్కర్త మహర్షి బసవన్న ఇంట్లో మంటలు చెలరేగితే ఇంటిని దహిస్తాయి. కోపం అన్న అగ్ని అది తెచ్చి పెట్టుకున్న మనిషిని దగ్ధం చేస్తుంది. తర్వాత ఇతరులకు హాని చేస్తుంది అవి. ఇలా పద్యాలూ సుభాషితాలు చెప్పి కోపం వస్తే చంపుకో నిన్ను నువ్వే బాధించుకో అని కాదు చెప్పటం. అసలు శాంతంగా కోపకారణమైన అంశం గురించి ఒక్క నిమిషం ఆలోచించి తప్పు నీదా ఇతరులంతా అని నిస్పక్షపాతమైన జడ్జిమెంట్ ఇచ్చుకో. ఒకవేళ నీదే అయితే కోపం తెచ్చుకోవటం ఖచ్చితంగా నీ అసమద్దత నిస్సహాయత. తప్ప అవతల వాళ్లదే అయితే నిగ్గదీసి అడుగు. నిలదీసి తేల్చుకో. అప్పుడు నోరెత్తకపోవటం నీ తప్పు. సమాధానం చెప్పలేకపోతే ఎదుటివాళ్ళ పరాజయం. నీ గెలుపు. ఇక గెలుపులో కోపం ఎందుకే నీహారికా !!
Categories
Nemalika

తప్పునీదా ఇతరులదా ? తేల్చుకోముందు

నీహారికా ,

ఇప్పుడు రెండు వేమన పద్యాల్లోని ఒక్క లైను చెపుతూ కోపముండు బతుకు కొంచమై పోవును. ఇదొక పద్యం లోది. శాంతభావ మహిమ చర్చించ లేమయా. ఇది ఇంకో పద్యంలోని లైవ్. ఎంచెపుతున్నాడంటే  కోపం వలన మనిషి తన వివేకాన్ని ఆలోచననీ కోల్పోతున్నాడు. పరాజయానికి కారణం విశ్లేషించుకోలేడు. అంచేత ఎంతటి విద్యావంతుడైన కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే అందరినీ దూరం చేసుకుంటాడు అని. అలాగే శాంతం  వలన మనిషి తన ఆలోచనలు అదుపులో వుంచుకోగలుగుతాడు. అన్నింటా జయం కలుగుతోంది. శాంత స్వభావి ప్రజల మన్నన పొందుతాడు అవి, పదకొండవ శతాబ్దపు దక్షిణ భారత దేశపు సంఘ సంస్కర్త మహర్షి బసవన్న ఇంట్లో మంటలు చెలరేగితే ఇంటిని దహిస్తాయి. కోపం అన్న అగ్ని అది తెచ్చి పెట్టుకున్న మనిషిని దగ్ధం చేస్తుంది. తర్వాత ఇతరులకు హాని చేస్తుంది అవి. ఇలా పద్యాలూ సుభాషితాలు చెప్పి కోపం వస్తే చంపుకో నిన్ను నువ్వే బాధించుకో అని కాదు చెప్పటం. అసలు శాంతంగా కోపకారణమైన అంశం గురించి ఒక్క నిమిషం ఆలోచించి తప్పు నీదా  ఇతరులంతా  అని నిస్పక్షపాతమైన జడ్జిమెంట్ ఇచ్చుకో. ఒకవేళ నీదే అయితే కోపం తెచ్చుకోవటం ఖచ్చితంగా నీ అసమద్దత నిస్సహాయత. తప్ప అవతల వాళ్లదే అయితే నిగ్గదీసి అడుగు. నిలదీసి తేల్చుకో. అప్పుడు నోరెత్తకపోవటం నీ తప్పు. సమాధానం చెప్పలేకపోతే ఎదుటివాళ్ళ పరాజయం. నీ గెలుపు. ఇక గెలుపులో కోపం ఎందుకే  నీహారికా !!

Leave a comment