నీహారికా,

మనం అంటూ లేని ప్రేమాతో పిల్లల పట్ల చాలా అపచారాలు చేస్తూ వస్తున్నాం. మనం పిల్లలు ఇప్పుడు సక్సెస్ తోనే ఉండాలని ఆశించడం పెద్ద తప్పు కాదు. కానీ ఒక్కో సారి అది అసాధ్యం కావచ్చు కుడా. ఇప్పుడు సక్సెస్ నే తెచ్చి పెట్టగలరా పసివాళ్ళు. ఒక్కో సారి ఫెల్యూర్స్ కుడా వస్తాయి. కష్ట చదువులో వెనక బదిపోగానే వాళ్ళను మిగతా వాళ్ళతో పోల్చి చూసి కించ పరుస్తాం. అదే మనం చేసే మొదటి తప్పు ఒక వేళ పసివాళ్ళు వెనకబడితే, మరీ వంద మార్కుల విజయం సాధించలేకపోతే  ముందు మనం బాధ పడకూడదు. పిల్లలకి చదువుల్లో, ఆటల్లో విజయం, పరాజయం అత్యంత సహజం అని నూరి పోయాలి. చదువులోను  ఆటల్లోనూ సక్సెస్ ను స్పూర్తిగా తీసుకోవాలని, అది సాధించగలిగినా, సాధించ లేకపోయినా పెద్దగా దిగులు పడనక్కరలేదని ధైర్యం చెప్పాలి. పరీక్షల్లో పట్టు సాధించేందుకు వీలైనంతగా సాయపడాలి, ఇంకాస్త వైవిధ్యంగా నేర్చుకునే పద్దతులని నేర్పించాలి కనీ ముందుగా మనం నిరాశ పది వాళ్ళని నిరాశ పరచడం చాలా దారుణం ముందు మనల్ని మార్చుకుంటే పిల్లలు సంతోషంగా వుంటారు.

Leave a comment