నీహారిక,

చాలా ఇళ్ళలో పిల్లలపై తల్లిదండ్రులు ప్రతి చిన్న విషయంలో తప్పులు వెతుకుతారు. దాన్ని ఎలా సరి చేసుకోవాలో జాగ్రత్తలు చెప్పేస్తూ ఉంటారు. లేదా పిల్లలపై విరుచుకు  వాళ్ళని తిట్టడము, కొట్టడమూ చేస్తారు. ఇది ప్రేమతో అయినా, పిల్లల బాగు కోసం అయినా సరే ముందుగా భాద పడేది పిల్లలే. ఈ వ్యధ లో వాళ్ళకి అంతులేని అనారోగ్యాలు చుట్టూ  ముట్టేస్తాయని చైల్డ్ సైకాలజిస్ట్ లు చెప్తున్నారు. వాళ్ళు పెరిగి పెద్దయి తప్పని సరిగా తమ పిల్లల విషయంలోను ఇలాగే కటినంగా ఉంటారని, అలాగే తల్లి దండ్రులు శత్రువులుగా భావిస్తారని చెప్తున్నారు. పిల్లలు ఎదిగే వయసులో అన్ని నేర్చుకొనే క్రమంలోనే ఉంటారు. పర్ ఫెక్ట్ గా లేరని వాళ్ళని నిందించడం తల్లి దండ్రులు చేసే పొరపాటు. ఈ పొరపాటుకు శిక్ష అనుభవించేది కూడా వాళ్ళే. పిల్లల మనస్సుతో స్థానం పోగొట్టుకొంటారు. గౌరవం పోగొట్టుకుంటారు. చివరకు వాళ్ళని మొండి వాళ్ళుగా మంచి వినని వాళ్ళుగా తయారు చేస్తారు. ఇలా ఉంటే మటుకు ముందుగా తల్లిదండ్రులకే కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది.

Leave a comment