౩౦౦వ సినిమా మామ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శ్రీదేవి చిత్ర పరిశ్రమలో ఇది స్వర్ణోత్సవం. 50 ఏళ్ళ వయస్సు దాటినా శ్రీదేవి ఇప్పటికి ఎవర్ గ్రీన్. తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమలో తిరుగు లేని తారగా ముద్ర వేసుకున్న శ్రీదేవి తోటి తరాల తో పోల్చితే అందం లో శారీరకమైన హెచ్చు తగ్గుల్లో కొంచమయినా వ్యత్యాసం లేకుండా తరగని అందం తో కనిపిస్తుంది. 15 సంవత్సరాల విరామం తర్వాత బాలీవుడ్ లో ఇంగ్లీష్ వింగ్లిష్ లో నటించిన శ్రీదేవి నాజూకు తనం అపూర్వం నటిగా శ్రీదేవి వయస్సు 50. ఈ 50 సంవత్సరాల్లో 299 సినిమాల్లో నటించి 300వ సినిమా తో మన ముందుకు రాబోతుంది ఆమె. శ్రీదేవి జితేంద్రలు అత్యంత సక్సెస్ ఫుల్ జంటగా దాదాపు 20 సినిమాల్లో నటించారు. అలాగే అనితా కపూర్ తో ఆమె 14 సినిమాల్లో నటించింది. ఎన్టి రామారావు, నాగేస్వరరావు, కృష్ణ, శోభన్ బాబు వంటి హీ రోలతో నటించిన ఆమె చినప్పుడు ఎన్టిఆర్, శోభన్ బాబుల టో బాల నటిగానూ పని చేసిన రికార్డు వుంది. తమిళంలో రజనికాంత్, కమల్ హాస్సన్ సరసన సక్సెస్ఫుల్ గా సినిమాల్లో నటించింది. తర్వాత తరం హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తోనూ నటించింది. యాభై ఏళ్ళుగా ఆమె తిరుగు లేని తారె. అతిలోక సుందరే.
Categories