ఎంగేజ్ మెంట్ టాటూలు , మ్యాచింగ్‌ టాటూలు వచ్చాయి. సాధారణంగా ఎంగేజ్ మెంట్ అనగానే ఉంగరాలు మార్చు కోవడం ఆ తర్వాత పూజపునస్కారాలు ఉంటాయి. అలా పెట్టుకొనే ఉంగరాన్ని అదోక తీపి జ్ఞాపకంగా జీవితాంతం భద్ర పరుస్తారు. చాలా ఇష్టంగా చూసుకొంటారు. కానీ ఇప్పుడు ఉంగరాలు మార్చుకునేందుకు బదులు ఇద్దరు తమ వేళ్ళపై లేదా చేతులపై మ్యాచింగ్‌ టాటూలు వేయించుకొంటున్నారు. బాహుబలి సినిమాలో పచ్చబొట్టేసినా తరహాలో కాకపోయినా ఈ వేళ్ళపై, చేతులపై వేయించుకొనే టాటూ తమ ప్రేమకు గుర్తుగా శాశ్వతంగా ఉంటాయని కాబోయే దంపతులు ఆ కాంక్షిస్తున్నారు. ఆమెరికా ,యూరప్ లో ఇప్పుడు ఆ ట్రెండ్ నడుస్తోంది.

Leave a comment