టీ లేకపోతే మానవ జీవితంలో వెరైటీ వుండదండీ అన్నాడొకమహానుభావుడు. అదేమో గానీ మన జనాభా లో అత్యధికులకు అభిమాన పానీయం ఏమిటీ అంటే టీ నే అంటున్నారు గణాంకాలు. ప్రపంచంలో నానారకాల టీ లు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో అస్సాం టీ , డార్జిలింగ్ టీ , నీలగిరి టీ లకు అద్భుతమైన గిరాకీ వుంది. ఇన్ని చెప్పుకున్నాక చక్కని టీ తాగాలి అనుకుంటే అన్ని సందర్భాలకు ఒక టీ పనికి రాదు అంటారు ఎక్సపర్ట్స్. శరీరంలో ఏమాత్రం చురుకుదనం లేకపోతే జీవన క్రియ వేగం పడిపోతే గ్రీన్ టీ తాగాలట. నిద్ర లేక శరీరం అలసట తో ఉంటే చామంతి పూలు వేసిన టీ తాగాలి. ఒత్తిడి కలిగించే ఆలోచనలు వదిలించుకోవాలిఅంటే నిమ్మ పరిమళపు లెమన్ టీ తాగాలి. కడుపులో వికారంపెడితే అల్లం టీ  ఉబ్బరంగా ఉంటే పుదీనా ఆకుల టీ తాగాలి. అవన్నీ పక్కనపెట్టి మనకు అందుబాటులో వుండే ఎదో ఒక టీ  తాగాలి ఏమంటారు?

Leave a comment