చర్మ సౌందర్యం మెరుగు పడాలంటే ప్రతి రోజు మెంతి టీ తాగమంటారు.స్పూన్ మెంతులను పావు లీటర్ నీళ్లలో మరిగించాలి. దానికి నాలుగు ఐదు తులసి ఆకులు కలపాలి. వడకట్టి తేనె కలిపి తాగితే ఈ  టీ చర్మాన్ని తాజాగా తేమగా ఉంచుతుంది.ప్రత్యేక పదార్థాలతో ఎండబెట్టిన చామంతి మొగ్గలు బజార్లో దొరుకుతాయి.వీటిని నీళ్లలో మరిగించి తేనె  కలిపి ఆ నీటితో ముఖం కడిగేసి తుది చేయకుండా అలా వదిలేస్తే చర్మం ఛాయ మెరుగవుతోంది.అలాగే నిమ్మ చెక్కను రెండు కప్పుల నీళ్లలో వేసి మరిగించి దానికి చెంచా బెల్లం కొద్దిగా తెనె గుప్పెడు గులాబీ రేకులు కలిపి చల్లారాక ఆ నీటి తో ముఖం శుభ్రం చేసుకుంటే చర్మం పై ఉన్న టాన్ పోతుంది.మొహం పై నల్ల మచ్చలు పోతాయి.

Leave a comment