క్రమం తప్పకుండ వారానికి మూడుసార్లు టీ తాగితే  ఆయుష్షు పెరుగుతోందని ఒక అధ్యయనం చెపుతోంది. టీ తాగే వాళ్ళలు హుద్రోగ మరణాలు చాలా తక్కువగా కనిపించాయంటున్నారు. ఒక లక్ష మందితో ఒక సర్వే నిర్వహించారు ఇందులో టీ తాగనివాళ్ళు సగం గా ఉన్నారు. టీ తాగేవాళ్ళలో ఎక్కువ కాలం జీవించే వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా రకరకాల టీ లు తాగేవాళ్ళలో గ్రీన్ టీ తాగేవాళ్ళు చాలా ఆరోగ్యంగా ముఖ్యంగా గుండె జబ్బులు మాటే లేకుండా వున్నారు. టీ తాగేవాళ్ళలో మెదడు పనితీరు ఎంతో మెరుగ్గా ఉంది. ఆరోగ్య పరంగా ఎంతో బావున్నారని,టీ తాగటం వల్ల లాభమే తప్ప నష్టం లేదంటున్నారు పరిశోధకులు.

Leave a comment