మొటిమలు ఇబ్బంది పెడుతూ వుంటే ఇబ్బందే. ఇవి ఒక పట్టాన తగ్గవు తగ్గి మచ్చలు పోవాలంటే నెలల సమయం తీసుకుంటుంది. నూనె ఎక్కువ అయిటే మొటిమలు ఎక్కువ వస్తాయని సబ్బుతో  పదే పదే కడుగుతూ ఉంటారు. ఇలా చేయడం మరీ ప్రమాదం ఎందుకంటే పొడి చర్మమ వల్ల మొటిమలు మరింత పెరిగే అవకాశం వుంది. చర్మం కుడా దెబ్బతింటుంది. వర్షం పడుతూ వుంటే నాన్ వాటర్ బేస్డ్ మాయిశ్చురైజర్లను వాడాలి. మొహం పై ఏదైనా అప్లయ్ చేసే ముందర చేతులు శుబ్రంగా కడుక్కోవాలి.లేకపోతె ఆ ఇన్ ఫెక్షన్ చర్మానికి పాకి మొటిమలు మరింత ఎక్కువగా వచ్చే  ప్రమాదం వుంది. ఈ సీజన్ లో టీ ట్రీ ఆయిల్ చర్మానికి ఎంతో మంచిది. ముఖ్యంగా జిడ్డు చర్మమ గలవారిపై ఇది బాగా పని చేస్తుంది. ఈ ఆయిల్ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ కుడా.

Leave a comment