కరోనా వ్యాప్తి నేపథ్యంలో భవిష్యత్తులో మహిళ వ్యాపారవేత్తలు టెక్నాలజీ వాడకం ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువ  చేయటం  చాలా ముఖ్యం దీనికి సంబంధించి శిక్షణా తరగతులు ప్రారంభించబోతున్న అంటున్నాడు ఉషారాణి మన్నె. ప్రతిష్టాత్మక ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఫ్లో)హైదరాబాద్ చాప్టర్ కు ఆమె నూతన చైర్ పర్సన్ గా  ఎంపికయ్యారు. తెనాలి పుట్టిపెరిగాను సోల్ మన్ ఇన్ స్ట్రమెంట్స్ పేరుతో సొంత కంపెనీ స్టార్ట్ చేశాను. మా కంపెనీ ఇప్పుడు 350 మందికి ఉపాధి కల్పిస్తోంది. పదకొండేళ్ల క్రితం ఫిక్కీ లో సభ్యురాలుగా చేరి రకరకాల కమిటీల్లో పనిచేశాను. ఇక రాబోయే రోజుల్లో వివిధ రంగాలకు చెందిన నిపుణులు, పరిశ్రమాధిపతులు  స్పీకర్ స్టేషన్ చేపడతాం. ‘పవర్
హవర్స్’ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమం మహిళా పారిశ్రామిక వేత్తలకు స్ఫూర్తిదాయకం అవుతుంది అంటున్నారు ఉషారాణి మన్నె.

Leave a comment