బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ నిర్వహించిన గోల్ కీపర్స్ గ్లోబల్ గోల్స్ అవార్డ్ అందుకొంది 20 ఏళ్ళ ఆమికా జార్జ్.  భారతీయ మూలాలున్న అమ్మాయి యుక్త వయసులో తోటి బాలికలు నెలసరి సమయంలో అవసరం అయ్యే నాప్కిన్లు కొనుక్కోలేక ఇబ్బంది పడే విషయాన్ని గుర్తించి ప్రభుత్వానికి ఈ విషయం తెలిసేలా ప్రచారం ప్రారంభించింది అమికా. ముందుగా తన వంతుగా నాప్కిన్లు పంచుతు సాయం చేసింది,కానీ ఎంతోమంది పిల్లలకు తాను చేసే సాయం సరిపోదని ప్రభుత్వం సాయం అందితే కానీ ఈ సమస్యకు పరిష్కారం దొరకదని కోర్ట్ లో  కేస్ దాఖలు చేసి పోరాటం మొదలుపెట్టింది. ఆమె పోరాటానికి ఇంగ్లాండ్ ప్రభుత్వం దిగి వచ్చింది. ఈ కృషికి గాను అమికా అవార్డ్ సొంతం చేసుకొంది.

Leave a comment