ఆలియా భట్, కరీనాకపూర్, కీర్తిసనన్, దీపికా పాడుకొనే లాంటి వాళ్ళు ఈ సంవత్సర కాలంగా ఎన్నో సార్లు జంప్ సూట్, తో రాంప్ వాక్ చేస్తున్న ఫోటోలు కనీస్తున్నాయి. ఇవి సినిమా హీరోయిన్లకే కాదు అమ్మాయిలెవరైనా మోడ్రన్ ఫ్యాషన్ ఇష్టపడే వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది.నడుము తీరైన ఆకృతిలో కనిపిస్తూ పై నుంచి కింద వరకు ఒకే డిజైన్ లో ఈ జంప్ సూట్వంటికి అతుక్కు పోయి కనిపిస్తుంది. సాధారణంగా ఎలాస్టిక్ వుంటుంది. లేదా అదే వస్త్రంతో తాయారు చేసిన బెల్ట్ వుంటుంది కనుక నడుమును పట్టి ఉంచుతుంది. లెనిన్, నూలు, డెనిమ్ వస్త్రాలతో చేసిన జంప్ సూట్ సౌకర్యంగా వుంటుంది. శాటిన్ సిల్క్ చూసేందుకు ఆడంబరంగా కనిపించవచ్చు కానీ ఏ కొద్ది సేపోతప్ప సాయంత్రం వరకు ఏ పార్టీ లోనో వుండాలంటే కష్టం. చిన్నప్రింటు గళ్ళు చిన్ని డిజైన్స్లో వుంటాయి కనుక వీటి మీదకి ఫంకీ జ్యూవెలరీ బాగుంటుంది. టీనేజ్ అమ్మయిలకు ఈ జంప్ సూట్ చాలా బాగుంటుంది. స్టాక్ ఫొటోస్ కనిపిస్తాయి చూసి ఎంచుకోవచ్చు.

Leave a comment