ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో టీనేజ్ పిల్లల్లో మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయని దానికి కారణం వాళ్ళలో నిద్రపోయే సమయం బాగా తగ్గిపోవడమే కారణం అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా నిపుణులు.శారీరక మానసిక ఆరోగ్యానికి రోగ నిరోధక శక్తి పెరగటానికి నిద్ర అందరికీ అవసరమే.కానీ టీనేజర్లకు మరీ అవసరం వారు కనీసం 8 గంటలు నిద్రపోవాలి మానసిక సమస్యలు ఏదైనా ఎక్కువగా పద్నాలుగు సంవత్సరాల వయసులోనే మొదలవుతాయని వాటిని ఎంతకూ తగ్గించలేక పోతామని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం చెబుతోంది.ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడపటం వల్ల ఎన్నో రకాల గ్యాడ్జెట్లు నుంచి వచ్చే నీలికాంతి నిద్ర కు కారణం అయ్యే మెలిటోనిన్ శాతాన్ని తగ్గించటంలో క్రమేగా నిద్రకు దూరమై మానసిక సమస్యల బారిన పడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు.

Leave a comment