కరోనా ఎంతోమంది లో ఉండే దయాని,ప్రేమని సమాజం పట్ల వారు చూపించిన బాధ్యతను వెలుగులోకి తెచ్చింది తేజస్ సోనావనే ముంబై పోలీస్ ఆయన పై అధికారుల ఆమోదం తీసుకుని అంబులెన్స్ సేవలు మొదలు పెట్టాడు. ఒక స్నేహితుడి వ్యాన్ తీసుకొని దాన్ని అంబులెన్స్ గా మార్చి అత్యవసర పరిస్థితి లో ఉన్న వారి కోసం సిటీలో తిప్పుతున్నాడు. పిఇపి ధరించే స్థోమత లేకపోవడంతో మామూలు ట్రాన్స్పరెంట్ గౌన్  వేసుకొని తలకు క్యాప్ ముఖానికి మాస్క్, గ్లౌజులు వేసుకుని రోగుల్ని సురక్షితంగా ఆసుపత్రులకు తీసుకు వెళ్తున్నాడు.లోకమంతా కరోనా భయం తో అల్లాడుతోంది. చికిత్స అందవలసిన రోగులకు రవాణా సదుపాయాలు సరిపోవటం లేదు అందుకే నా వంతు సేవగా ఈ అంబులెన్స్ నడుపుతున్న అంటున్నాడు తేజస్.ఈయనను కరోనా హీరో అన్నారు పోలీసులు, ప్రజలు కూడా.

Leave a comment