తేజస్వినీ రంగారావు మన దేశం నుంచి మొదటి మహిళ విజో గా ఎంపిక అయింది.సుఖోయ్ వంటి యుద్ధ విమానాలు చేసే యుద్ధ విన్యాసాలు నిర్వహించేందుకు పైలెట్ల తో పాటు ప్రత్యేకంగా వెపన్ సిస్టమ్ అధికారులు ఉంటారు.వాళ్లనే విజో అంటారు.ఆకాశంలో యుద్ధ తంత్రాలు రచించటం వీళ్ళ పని. ప్రతిష్టాత్మక సుఖోయ్ 30 ఫ్లీట్    విమానాలకు విజో బాధ్యతలు అందుకుంది తేజస్వినీ.ఆమె స్వస్థలం చెన్నై తండ్రి రంగారావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ తల్లి రాధిక గృహిణి.

Leave a comment