తప్పిపోయిన పిల్లలు , బిక్షాటనలో ఉన్న పిల్లలు, ట్రాఫికింగ్ కు గురైన పిల్లలను గుర్తించటం కోసం తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలోని విమెన్ సేఫ్టీ వింగ్ ఇటీవల ఆపరేషన్ స్మైల్ ను ప్రారంభించింది. దీనికి సంబంధించిన ముఖాన్ని గుర్తించేందుకు వీలుగా దర్పన్ పేరుతొ ఒక టూల్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ టూల్ సహాయంతో తెలంగాణ పోలీసులు అస్సాం లోని లఖిమ్ పూర్ లో భోగినోడికి చెందిన అంజలి,ఢిల్లీలో జీవనోపాధి కోసం వెళ్ళి తప్పిపోయి అస్సాం చేరిన విషయం గుర్తించారు. ఇలాంటి పిల్లలను ఈ దర్పన్ టూల్ సాయంతో తేలికగా గుర్తించగలమని చెపుతున్నారు పోలీసులు.

Leave a comment