చిన్న వయస్సు లోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది. జుట్టు కుదుళ్ళు బలహీనం అయిపోతున్నాయి. వాతావరణ కాలుష్యం అధిక వత్తిడి ఇందుకు కారణం, అయితే కరివేపాకు తో తెల్లజుట్టును మాయం చేయచ్చు అంటున్నారు న్యూట్రీషనిస్టులు. ఆహారంలో కరివేపాకు భాగంగా వుండాలి. మెంతులు పొడి చేసి పెరుగు లో కలిపి జుట్టుకు అప్లయ్ చేసే ఎండి పోయినా తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది. వారానికి ఒక సారి ఇలా చేస్తే చాలు ఉసిరికాయ ముక్కలు, పుదీనా , కరివేపాకు గుడ్డలో చుట్టి సూర్యరశ్మి పడేలా మూడు రోజులు ఎండలో ఉంచాలి. బాగా ఎండిపోయాక పొడి చేసి ఈ పొదిలో ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం అంటున్నారు. నిమ్మరసం, బీట్ రూట్ రసం, టీ డికాషన్ లో పెరుగు కలిపేసి ఈ మిశ్రమం తలకు ప్యాక్ వేసుకుని గంట సేపు ఉంచేసి తలస్నానం చేసేయాలి. ఈ రసాలు తెల్లజుట్టుని మాయం చేస్తాయి. కుదుళ్ళకు బలం ఇస్తాయి.

Leave a comment