హైద్రాబాద్ లో గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ ఇండియన్ ఆరిజన్ ఏడవ వార్షిక సదస్సు జరుగుతోంది. ఈ సదస్సు కు హాజరైన జాతీయ అంతర్జాతీయ వైద్య నిపుణులందరి ఏకాభిప్రాయం ప్రకారం పాలిష్ చేసిన తెల్లని బియ్యం స్వీట్లు జంక్ ఫుడ్ మద్య పాణం వంటి అలవాట్ల వల్లనే ఆరోగ్యం దూరమవుతుందని ఒక విలేకరుల సమావేశంలో తేల్చి చెప్పారు. ఆహారంలో దంపుడు బియ్యం జొన్నలు వుండి తీరాలన్నారు. ఇక మధుమేహం వున్నవాళ్ళైతే పుల్కాలు జొన్న రొట్టెలు టీయూస్కుంటే గ్లూకోజ్ నియంత్రణ లో వుంటుందన్నారు. అలాగే సురక్షితమైన తాగేనీళ్ళు అంటే కాచి చల్లార్చిన నీళ్లు తాగితే 80 శాతం జబ్బులు రావన్నారు. కుర్చీలకు అతుక్కుపోవటం వల్లనే సగం ప్రాబ్లమ్ అనీ రోజుకు 10 వేల నుంచి 20 వేల అడుగులు వేస్తె ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు . ఈ అడుగులు లెక్కించేందుకు అనేక పరికరాలు మొబైల్ యాప్స్ వున్నాయి కదా ఖచ్చితంగా ఈ నడక తో ఆరోగ్యం నిలుపుకోవచ్చన్నారు. కుటుంబ నేపధ్యం దృష్టిలో ఉంచుకుని 25 సంవత్సరాల వయస్సు నుంచే సంవత్సరానికి ఒక్కసారన్నా వైద్య పరీక్షలు చేయించుకోమని సలహా ఇచ్చారు.
Categories
WhatsApp

తెల్లని బియ్యమే సగం ప్రాబ్లమ్

Leave a comment