ఒక చిన్న తమాషా. మనకి ఆరోగ్యం  అందించేవన్నీ తెల్లని రంగులోనే ఉంటాయి. గమనించారా ? నెయ్యి తెల్లగా ఉంటుంది. మెదడు పనితీరు కీళ్లు మెరుగ్గా ఉండటం కీలకమైన విటమిన్లను గ్రహించటం తో నెయ్యిదే కీలకపాత్ర. కొబ్బరి ఇది చర్మానికి శిరోజాలకు చేసే మేలు అంతా ఇంతా  కాదు. జీడిపప్పు కాల్షియం మెగ్నీషియం అధికంగా వుండే జీడిపప్పు కండరాలకు ఎముకలకు బలం. డయాబెటిక్ ఉంటే దాని కనిష్ట గ్లైనమిక్  ఇండెక్స్ ఎంతోమంచి చేస్తుంది. అరటి పండులో కొవ్వులు వుండవు. అరటి ఆనందం కలిగిస్తుంది. బూడిద గుమ్మడి శరీరంలో నీరు నిల్వ నివ్వదు. విషపూరిత పదార్దాలను శరీరం నుండి బయటకు పంపుతుంది. ఉల్లి పాయలో సల్ఫేర్ అధికం. వెల్లుల్లి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. సముద్రపు ఉప్పులో పోషకాలు 88 సూక్ష్మ లవణాలు వున్నాయి. బంగాళా దుమ్పలో కొవ్వులేదు. కార్బోహైడ్రాట్స్ పోషక పదార్ధాలున్నాయి. కాలీఫ్లవర్ లో పీచు యాంటి ఆక్సిడెంట్ గుణాలున్నాయి. పాల ఉత్పత్తుల్లో ఎన్నో ఆమ్లాలు లభిస్తాయి. తెల్ల నువ్వులు ఇది వెన్నకు ప్రత్యామ్నాయం. ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. తెల్లని పదార్దాలకీ  ఆరోగ్యానికీ ఎంతో దగ్గర సంబంధం ఉంది.

Leave a comment