నా ఆలోచనలు,మాటలు అన్నీ తెలుగు చుట్టూనే తిరుగుతాయి. తెలుగు సినిమా,తెలుగు భాష నాకెంతో ఇష్టం. ఎక్కడ పని చేసిన నేను తెలుగు తారనని చెప్పుకునేందుకు ఇష్టపడతాను అంటుంది రకుల్ ప్రీత్ సింగ్. జీవితంలో,కెరీర్ లో ఎదురయ్యే పరాజయాలు ఎప్పుడు పాఠాలు నేర్పుతునే ఉంటాయి. విజయం యొక్క విలువను గుర్తు చేస్తాయి. అందుకే నాకష్టం ఎప్పుడు ఒక్కలాగే ఉంటుంది. ఇప్పుడు సినిమాలు చాలా శ్రద్ధగా ఎంపిక చేసుకుంటున్నా. ఇది వరకు నేను మంచి సినిమా వస్తే ,మంచి సక్సెస్ వస్తే అని ఎదురుచూసిన దాన్నే ఇక ఇప్పుడు నా ప్రతిభకు నేనే పరీక్ష పెట్టుకుంటున్నాను అంటుంది రకుల్ ప్రీత్ సింగ్.

Leave a comment