Categories
తెల్లని తెలుపు వేసవికి చల్లదనాన్ని ఇచ్చే రంగు. ఇది ఒక్కటే అయితే స్తబ్దుగా ఉంటుందని దాన్నిఇతర రంగులతో జోడించి అద్భుతమై న దుస్తులు రూపొందిస్తారు డిజైనర్లు. నీలం ఎరుపు గులాబి ఊదా, నారింజా ఆకుపచ్చ లాంటి ఏ రంగులైన తెలుపుతో కలిస్తే బావుంటాయి. ఏ సాయంత్రమో చల్లగా తెల్లని దుస్తులు ధరించాలనుకొంటే మిగతా యాక్సెసరీలు నల్లనివో ,నలుపు ,తెలుపు కలగలిపినవో వేసుకొంటే అందం అంటారు ఫ్యాషనిస్టులు. ఈ వెన్నలాంటి తెల్లని వస్త్రంపైన నీలం కలిపితే హుందాగా,నారింజ కలిపితే ప్రకాశవంతంగా ఉంటుంది.ఈ సారి ఇలా ట్రై చేయవచ్చు.