శారీరక శక్తి స్ధాయిలు స్ధిరంగా ఉంచేందుకు శరీరాన్ని సమతుల్యంగా ఉంచే చల్లని పదార్ధాలు చాలా అవసరం. నీటి శాతం అధికంగా వుండే పదార్ధాలు స్వేదం, ఇతరాత్ర కోల్పోయిన తేమను బర్తీ చేస్తాయి. పండ్లు, కురగాయలు, సలాడ్లు, జ్యూస్లు దైనందన ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఇందుకు గానూ నిమ్మ, ఆరంజ్, నారింజ, పుచ్చ, ఖర్భుజా వంటి వాటిని అత్యధికంగా తీసుకోవాలి. కీర, టొమాటో, ఉల్లిపాయ, లేట్యుస్, క్యాబెజీలను అన్నం, లేగ్యుమ్, గోధుమ తో పాటుగా తీసుకుంటే శరీరంలో నీటి నిల్వలు బాగుంటాయి. నిమ్మరసం, కొబ్బరి నీళ్ళు, పల్చని మజ్జిగ స్వేదం ద్వారా శారీరం కోల్పోయిన నీటిని భర్తీ చేస్తాయి. కొవ్వు వేపుడు పదార్ధాలు ఒక పట్టాన జీర్ణం కావు. మాంసం, నట్స్, గింజలు, వెల్లుల్లి, లవంగాలు, అవనునె, కాఫీవంటివి శరీరానికి అపకారం చేసేవే. అలాగే డ్రై ఫ్రూట్స్ బదులుగా తాజా పండ్లు తినడం మంచిది.

Leave a comment