దేవతా మూర్తులతో రూపొందించే టెంపుల్ జూలరీ త్రీ డైమన్షన్స్ తో తయారు చేస్తున్నారు కళాకారులు. క్రీ.శ 9వ శతాబ్దం లో టెంపుల్ జ్యువలరీ తయారు మొదలైంది.హంసలు, నెమళ్లు, లక్ష్మీ రూపాలను, వజ్రాలు, కెంపు లతో పొదిగిన నగలు దేవత దేవతలను అలంకరించే వాళ్లు.ఆ తర్వాత ఆ డిజైన్ల సాంప్రదాయ నృత్యాలు చేసే వాళ్ళు ధరించే వాళ్ళు.తర్వాత ఈ టెంపుల్ నగలను త్రీడి రూపంలో మందిరం తో సహా డిజైన్ చేయటం తాజా ట్రెండ్. దేవత మూర్తులను గుడి డిజైన్ లోనే కొలువుతీరి నట్లు గా తయారు చేస్తున్నారు డిజైనర్లు.గుడి డిజైన్ చాలా సున్నితంగా చక్కని పనితనంతో ఉండటంతో వాటిని అపురూపంగా ధరిస్తున్నారు అమ్మాయిలు.

Leave a comment