నిత్యం ఈ జగత్తును తన వెలుగు కిరణాలతో నిద్రలేపే సూర్యదేవునికి ఒక అద్భుతమైన ఆలయం ఉంది. ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం అద్భుతమైన శిల్ప కళా వైభవానికి, కళింగ వాస్తు నిర్మాణ శైలికి ప్రతీకగా ఉంటుంది. 70 మీటర్ల ఎత్తు పెద్ద రథం ఆకారంలో కనిపించే ఈ ఆలయాన్ని పదమూడవ శతాబ్దంలో గంగా వంశానికి చెందిన రాజు నరసింహ దేవ్ పూర్తిగా శాండ్ స్టోన్ తో నిర్మించారు ఆలయ నిర్మాణానికి 12 సంవత్సరాలు పట్టింది 1200 మంది కళాకారులు శ్రమించి నిర్మించిన ఆలయంలో సూర్యుని తొలి కిరణాలు పడతాయి. తలపై కిరీటం తో సర్వ భరణాలతో కనిపించే సూర్యుని రాతి విగ్రహం అలనాటి శిల్పుల కౌశలానికి  నిదర్శనంగా కనిపిస్తుంది. మందిరాన్ని తామరపువ్వు ఆకృతి పైన చెక్కటం తో దాన్ని పద్మ క్షేత్రమని పిలుస్తారు. ఆలయానికి ఎదురుగా ఉన్న నవ్య మందిరం లో తీర్చిదిద్దిన శిల్పాలు సంగీతం సంగీత వాయిద్యాలతో సూర్యదేవునికి నిత్యార్చన చేస్తున్నట్లు ఉంటుంది. మందిరం ఇరువైపులా ఉండే గజశ్వాలు ప్రాణంతో ఉన్నట్లే ఉంటాయి. ఇంత అద్భుతమైన నిర్మాణం కనుకనే యునెస్కో వారసత్వ కట్టడాల జాబిదాలో చోటు చేసుకోంది!

Leave a comment