10 అంతస్తుల భవనం నిర్మించాలంటే ఎంత సమయం తీసుకుంటుందీ ? కనీసం 6 నెలలు ఇంకా స్పీడ్ గా శ్రమపడితే కూడా అంత కంటే త్వరగా కట్ట లేదేమో కదా. కానీ చైనాలోని చాంగ్షా లో, బ్రాడ్ గ్రూప్ అనే సంస్థ 28 గంటల్లో పది అంతస్థుల భవనాన్ని కట్టేసింది .ఇది మానవ మేధస్సు సాధించిన అద్భుతం గా చెప్పుకోవచ్చు. మనిషి మెదడులో మెదిలిన ఒక గమ్మత్తు కి ఇది నిదర్శనం .అసాధ్యాల్ని సాధ్యం  చేయాలనే మనిషికి ఆకాంక్ష ఇది. పునాదులు, పిల్లర్లు, స్లాబ్ లు, గోడలు, ప్లాస్టరింగ్, తలుపులు, కిటికీలు, రంగులు ఇంత పని కదా ఇల్లంటే. దీన్ని బ్రాడ్  గ్రూప్ చాలా ప్లాన్డ్ గా సాధించింది. ఈ భవన నిర్మాణానికి కావలసిన లిఫ్ట్ దగ్గర నుంచి పిల్లర్స్, గదులు, గుమ్మాలు, బాత్ రూమ్ లు, అల్మారాలు, ఇంటీరియర్లు సమస్తం ముందే ఫ్యాక్టరీలో తయారు చేశారు .వాటిని ఫాల్ట్ అయ్యేలాగా తీర్చిదిద్దారు. ట్రక్కుల్లో ఆ మెటీరియల్ నింపి నిర్మాణ ప్రాంతానికి తీసుకువచ్చారు. దాదాపు అంతా స్టీల్ నే వాడారు .తర్వాత పెద్ద పెద్ద క్రేన్ ల సహాయంతో ఒక దాని పైన ఒకటి  పేరుస్తూ నిర్మాణాన్ని పూర్తి చేశారు. పేకల్ని పేర్చినట్లు అంతస్తులను పేర్చేశారు .ప్రస్తుతం ఈ భవనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మరి 28 గంటల్లో నిర్మాణం అంటే ఎంత ప్రత్యేకం !

Leave a comment