వెకేషన్ కు హాలీడేస్ కో టూర్ ప్లాన్ చేసుకుంటే అదొక తీపి జ్ఞాపకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా డైట్ విషయం పట్టించుకోండి. డ్రై ఫ్రూట్స్ , నట్స్  తాజా పండ్లు వెంట తీసుకు వెళ్ళాలి. డైట్ రిస్టిక్షన్స్ అక్కర్లేదు. ఎక్కడ ఏ ఫుడ్ దొరికితే దాన్ని ఎంజాయ్ చేయాలి. నాణ్యమైన అండర్ గార్మెంట్స్ ఎంచుకోవాలి. సైట్ సీయింగ్ కోసం ట్రెకింగ్ కోసం అనుకూలమైన దుస్తులు ఉండాలి. ఫస్ట్ ఎయిర్ కిట్ నొప్పి నివారణ మాత్రలు తప్పనిసరి. దగ్గుమందు జ్వరానికి పారాసెటమాల్ వంటి జనరల్ మెడిసన్ దగ్గరుంచుకోవాలి. నచ్చిన పాటలు వీడియోలు డౌన్ లోడ్ చేసి పీటుకోవాలి.లాంగ్ ట్రెక్ లో బోర్ కొట్టకుండా ఇవి బాగా పనికి వస్తాయి. కొంచెం ఖరీదెక్కువ లగ్జరీకి  ప్రాధాన్యత ఇవ్వాలి. ట్రెక్ మెమొరబుల్ గా నిలిచి పోవాలంటే ఈ మాత్రం చేయక తప్పదు.

Leave a comment