మార్కెట్లోకి ఎన్నో రకాల సౌందర్య ఉత్పత్తులు వస్తూ ఉంటాయి. అవి వాడే ముందర మో చేతి పైనో, చెవి వెనకో కాస్త రాసి టెస్ట్ చేసుకోవాలి. ఎర్రదనం,దద్దుర్లు రాకపోతే ఆ ప్రోడక్ట్ వాడోచ్చు. మాయిశ్చరయిజర్ రాసిన వెంటనే ఫౌండేషన్ ఉపయోగించకూడదు. మాయిశ్చరయిజర్ పూర్తిగా ఆరకనే ఫౌండేషన్ వేసుకోవాలి. సరైన మాయిశ్చరయిజర్ ఉపయోగించకపోతే స్వేద గ్రంధులు ముదిరి పోయి దద్దుర్లు,పొక్కులు వస్తాయి. ఈ ఎండల్లో వేడికి రోజులో ఎక్కువసార్లు ఫేష్ వాష్ ఉపయోగిస్తారు. అయితే నిమ్మగుణాలున్న ఫేష్ వాష్ తో మొహం శుభ్రపడటామే గాక మొటిమలు రావు.

Leave a comment