ఇంట్లో ఏ మూలైన పువ్వులు,కొమ్మలు,రెమ్మలు పెట్టి తగిలించేలా మాగ్నటిక్ ప్లవర్‌ వాజ్ లున్నాయి.ఇవి గాజుతో చేసిన చిన్ని పరీక్ష నాళికల్లాగా ఉంటయి. ఇందులో నీళ్ళు పోసి మనం పెట్టాలనుకునే చక్కని వాసన వేసే లిల్లీలు అందమైన చామంతులు చక్కని కొమ్మలు,ఆకులు అమరిస్తే ఎంతో తాజాగా ఉంటాయి. సాధారణ ఫ్రీజ్ అయస్కాంతాల కన్నా ఎక్కువ మ్యాగ్నెట్ లు ఇందులో ఉంటాయి. కనుక ఫ్రీజ్ కు వరసగా నాలుగైదు అంటించేసి చక్కని పూలు పెడితే ఆహారాలు కూడా తాజాగా కనిపించేస్తాయి. ఈ మాగ్నిటిక్ ఫ్లవర్ వాజ్ లతో బిరువాలు, ఫ్రీజ్ లు కళకళలాడతాయి.

Leave a comment