ఎవరైనా మరిచిపోయిన విషయం జ్ఞాపకం తెచ్చుకోవాలంటే కాసేపు కళ్ళు మూసుకొని ఆలోచించండి ఠక్కున గుర్తుతోస్తుంది అంటున్నారు పరిశోధకులు. బండి తాళం చెవులు, దువ్వెనలు ఎదో ఒకటి మరచి పోతూనే ఉంటారు. సాధారణంగా అలాగని విషయాలు గుర్తు తెచ్చుకోవాలంటే రెండు నిముషాలు కళ్ళు మూసుకొని అసంబంధిత విషయాల పైన మనసు లగ్నం చేస్తే ఆవే గుర్తుకువస్తాయి అంటున్నారు. ఇది పేరున్న సైక్రియాటిస్టులు కొందరు, కొన్ని వందల మంది పై ప్రయోగం చేసి తేల్చుకున్న విషయం సో…. ఏవరైనా గబుక్కున జ్ఞాపకం రాకపోతే కళ్ళు మూసుకొని అలోచించి చూడండి. ఫలితం వుంటుందేమో.

Leave a comment