Categories
అతి తక్కువ బడ్జెట్ తో మోడ్రన్ లుక్ వచ్చేలా ఇల్లు ఆఫీసు ఎలా అలంకరించుకోవాలో చక్కని సలహాలు ఇస్తుంది నిహేరా సోనావన్ వృత్తి రీత్యా ఆమె ఆర్కిటెక్ట్ ఇంటీరియర్ డిజైనింగ్ లో జాగ్రత్తలు ఎలాంటి మెటీరియల్ ఎంచుకోవాలి ఏ రంగులు ఎలాటి వాటికి బావుంటాయి. ఎక్కువ కాలం మన్నిక గా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో వంటి ప్రతి చిన్న అంశాన్ని వివరించే లా ఉంటాయి. నిహేరా సోనావన్ వీడియోలు నాలుగు లక్షల మందికి పైగా అనుసరించే ఈమె వీడియోలో డిజైనింగ్ కు తగిన అప్లయెన్సెస్ లను ఎలా ఎంచుకోవాలో సూచిస్తుంది. 2017 లో యూట్యూబ్ ప్రారంభించిన నిహేరా వీడియోలు, అందమైన ఇంటిని ఇంకెంత అందంగా అలంకరించుకోవచ్చో చెపుతాయి.