గర్భిణిగా ఉన్నప్పుడు సానుకూల దృక్పదంతో ఉంటే పుట్టబోయే బిడ్డ గణితం,సైన్స్ సబ్జెక్ట్స్ లలో అద్భుతంగా రాణిస్తారనీ బ్రిస్టల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెపుతున్నారు.గర్భిణిగా ఉన్న తల్లి మానసిక పరిస్థితి బిడ్డపై పడుతుందంటున్నారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించే తల్లులు ,పిల్లలకు మంచి ఆహారం అందిస్తారని పిల్లలను మంచి దృక్పథంతో పెంచుతారని ,చిన్నప్పటి నుంచి తల్లి దగ్గర శిక్షణ పొందిన పిల్లలు హోమ్ వర్క్ తదితర విషయంలో ముందుంటారని చెప్పారు. గర్భిణి బిడ్డల పెంపకంలో శిక్షణ తీసుకొంటే సంతానాన్ని ఎలా పెంచాలో ,వాళ్ళ మానసిక శరీరాక విషయంలో ఎలా పసిగట్టాలో తెలుకొని పిల్లల్ని ఉత్తమ పౌరులుగా ,ఆరోగ్యవంతులుగా ఆత్మవిశ్వాసం గల వారుగా తీర్చి దిద్దగలదని చెపుతున్నారు.

Leave a comment