దోసపండు ,కాయలు లేదా దోసజాతికి చెందిన ఇతర కీర, కర్బూజాల్లో నీటి శాతం చాలా ఎక్కువ. చాలా మందికి దోసకాయ ఇష్టం ఉండదు. పిల్లలయితే వద్దు బోర్ అని అంటారు. కానీ వేసవిలో తినవలిసిన కాయగూరల్లో ముఖ్యంగా దోసలు అన్నింటికంటే ఎనభై రకాల పోషకాలున్నాయి. ఇందులో పీచు ఎక్కువ మలబద్దకం రానియదు. నోటిలోకి అమ్లాలు చేరటం, చాతిలో మంట వంటివి తగ్గిస్తుంది. గ్యాస్ ట్రబుల్ రాదు. చర్మ సంబంధ వ్యాదులు, ఇన్ ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే అనేక విటమిన్లు ,ఖనిజాల్లో క్యాన్సర్ నుంచి కాపాడే గుణాలున్నాయి. దోస జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Leave a comment