ఓం శ్రీమాత్రే నమః
దుష్ట శక్తులను ఎదిరించడానికి మనం సర్వ వేళల తలచుకుంటూ నిత్యం ఆదిశక్తి పూజ చేస్తూ ఉండాలి సఖులు.
పశ్చిమ బెంగాల్లో ఉన్న శ్రీ తారాపీఠ్ అమ్మవారి దర్శనం చేసుకుని ఆ తల్లి చల్లని చూపులు మనపై ఉండాలని కొలుద్దాం.కథనాల ప్రకారం దక్షయఙ్ఞం లో ఆత్మాహుతి చేసుకున్న పార్వతీదేవిని చూచి ఉన్మాదుడైన శివుడు ప్రళయ తాండవం చేస్తున్న సమయంలో శ్రీమహావిష్ణువు అది గమనించిన శివయ్య దృష్టి మరల్చడానికి తన సుదర్శన చక్రంతో పార్వతీదేవి దేహాన్ని ముక్కలుగా చేసిన దానిలో నుంచి కనుగుడ్డు ఈ ప్రదేశంలో పడింది.ఇక్కడ అమ్మవారి శరీర ఛాయ నీలం రంగు.ఈమెను మనస్ఫూర్తిగా నమ్ముకుని పూజించిన కవితా ధరణా శక్తి,ఙ్ఞానేద్రియాల మీద పట్టు లభిస్తుంది.

నిత్య ప్రసాదం:కొబ్బరి,నిమ్మకాయల దండ.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment