ఫ్యాషన్ విషయంలో నేనెంతో ఫాస్ట్ గా ముందుంటాను అని అందరు అంటారు గానీ నిజానికి నేనసలు ఫ్యాషన్ ట్రెండ్ ఫాలో అవును. ఆలోచించండి. అస్సలు నాకంత తీరిక ఎక్కడండి అంటోంది అనుష్క శర్మ. విరాట్ తో పెళ్ళయ్యాక ఇటు కుటుంబం అటు నా కెరీర్,ప్రొఫెషన్ తో పరుగులు తీయటం సరిపోతుంది. అదీగాక నాకు పెద్దగా కలర్ కాంబినేషన్ల గురించి తెలియదు. ఎక్కువ వాడుకలో వుండే కలర్స్ తీసేసుకొంటూ. ఒక్కసారి విరాట్ కొనుక్కొన్న డ్రెస్ లు సొంతం చేసుకొంటాను ఒక వేళ అవన్నీ ఫ్యాషన్ గా ఉన్నాయి అనుకొంటే ఆ క్రెడిట్ విరాట్ కే దక్కాలి. అస్సలు నాదృష్టిలో ఫ్యాషన్ అంటే కంఫర్ట్. మనం వెళ్ళే ప్రదేశానికి మనకు అనుకూలంగా ఉండే డ్రెస్ ఫ్యాషన్. ఇది ఎవరైనా అనుకునేదే కదా. మన శరీరానికి కంఫర్ట్ ఇస్తే ఆడ్రెస్ అద్భుతమైంది అవునా అంటోంది అనుష్క శర్మ నిజమే కదా… ఫ్యాషన్ కంటే సౌకర్యం ముఖ్యం కదా ||

Leave a comment