ఐశ్వర్యాన్ని ప్రసాదించే భగవతి తెల్లని పూలదండల అలంకారాలతో ఉంటుందట. ఆ తల్లికి ఇష్టమైనవి కాయల్లో కొబ్బరికాయ, ఆకుల్లో మారేడు, నూనె జాతుల్లో నువ్వుల నూనె, ఆవునెయ్యి, రంగుల్లో తెల్లని తెలుపు. జలాల్లో గంగాజలం, పువ్వులలో పద్మం, వృక్షాల్లో చందన వృక్షం. గృహిణి సూర్యోదయానికి ముందే స్నానం చేసి చక్కని సాంప్రదాయపు తీరులో వస్త్రాలను ధరించి మెడలో మాంగల్యం మెట్టెలు తలలో పువ్వులు ధరించి ఆమె ప్రధాన ద్వారం నుంచి చూస్తూ ఉంటే తులసి కోట కనబడుతూ ఉంటే ఆ ఇంట నేను కొలువై ఉంటాను అంటుందట లక్ష్మి.

Leave a comment