సమాజాన్ని కదలించే నృత్య రూపకాలు  రూపొందించటం నా లక్ష్యం ముఖ్యంగా ఆడవాళ్ల పై హింసకు వ్యతిరేకంగా నృత్యరూపకాలు ప్రదర్శించటంతో నాకొక ఆత్మ సంతృప్తి ఉంటుంది అంటున్నారు ప్రముఖ కూచిపూడి నర్తకి లలితా సింధూరి చిన్నారి ఆసిఫా పై జరిగిన అత్యాచార సంఘటన గురించి వినగానే తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి రచించిన ‘చిన్నాన్ చిరు కెలియె’ పాటతో బాధితురాలి తల్లిదండ్రులు కడుపుకోతను ఇతివృత్తంగా నృత్యరూపకం రూపొందించాను.కుంతీ విలాపం పుష్ప విలాపం వంటి మరెన్నో గీతాలను నృత్యం కంపోజ్ చేశాను. అమ్మాయిల పై అఘాయిత్యాలకు వ్యతిరేకంగా మరెన్నో నృత్య రూపకాలు రూపొందించే ప్రయత్నంలో ఉన్నాను.

Leave a comment