అందం అంటే మేకప్ అనే భ్రమలో కి వచ్చారు చాలామంది దీన్ని తొలగించాలనే ఉద్దేశ్యం తో మేకప్ లేకుండా ఫోటో షూట్ చేశా.వాటిని ఇన్ స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఉంచా. ఈ మాధ్యమాల్లో ఎంతో మంది ముస్తాబై ఫోటోలు తీసుకోవటం పోస్ట్ లు పెట్టడం చూస్తున్నా.వీటి వల్ల వాళ్లలో సహజంగా ఉండే ఎన్నో లక్షణాలు కనబడకుండా పోతున్నాయని నాకు అనిపించింది అంటోంది కాజల్ అగర్వాల్.మనం మన లాగా కనిపించాలి ఆత్మవిశ్వాసంతో మెలగాలి అలా ఉంటేనే ఇతరులతో మనం మాట్లాడే భాష ఈ ఫోటోలో మనం చెప్పదలుచుకున్న వాతావరణం ఫోటోలో కి తీసుకురావటం ఒక గమ్మత్తు దీన్ని చెప్పాలనే నా ప్రయత్నం అంటోంది కాజల్ అగర్వాల్.ఈ మధ్య నే ఆమె మేకప్ లేకుండా చేసిన ఫోటో షూట్ వైరల్ అయ్యింది.

Leave a comment