తాటి బెల్లం నుంచి తీసిన లేత రసం పాకం పట్టి తాటి బెల్లం తయారు చేస్తారు. ఈ బెల్లం పొడిగా అయే వరకు కాస్తే తాటి కలకండ వస్తుంది. దీన్ని పామ్ షుగర్ అంటారు. ఇందులో తేమ 8. 6 శాతం సుక్రోజ్ 76 శాతం కొవ్వు,మాంసకృతులు అతి తక్కువగా ఉంటాయి కాల్షియం ఫాస్పరస్ మెగ్నీషియం పొటాషియం పంచదారలో కంటే అధికంగా ఉంటాయి. ప్రతి వంద గ్రాముల తాటి బెల్లంలో 308 క్యాలరీల శక్తి వుంటుంది. గర్భిణీలు భోజనం తిన్న తర్వత ఒక ముక్క తింటే ఇందులోని ఖనిజాలు అందుతాయి.తీపి తినాలని పిస్తే ఈ తాటి బెల్లం తింటే తిన్న తృప్తి వుంటుంది. మధుమేహం ఉంటే దాన్ని తినవచు. తాటి బెల్లం లోని ఖనిజాలు శరీరానికి ఎంతో ఉపయోగం పకృతి సిద్ధంగా లభిస్తుంది కనుక ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది.

Leave a comment