ఒక గంట ఏకాగ్రతతో సీట్లో కూర్చోని పని చేస్తే ఒత్తిడిగా ఉందని లేచి వెళ్ళీ కాఫీ తాగుతారు ఈ పానీయాలు తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి.అంతకంటే చేతిలో పని కాసేపు పక్కన పెట్టి లేచి వెళ్ళి ఏ కిటికీ దగ్గరో నిలబడి కాసేపు ప్రకృతిని చూడటం అలవాటు చేసుకొవటం మంచిదే. కళ్ళకీ ,మెదడుకీ ఇది మంచి విశ్రాంతి. ఎక్కువ సేపు కదలకుండా కూర్చోని చేసే ఉద్యోగాలతో ఈ వత్తిడి విసుగు రావటం మామూలే. అప్పుడైనా ఈ పానీయం పదేపదే తీసుకోవటం అనారోగ్యమే .చేతిలో వాటర్ బాటిల్ ఉంచుకొని మధ్యలో నీళ్లు తాగటం సగం అరటి పండు ,వేరు శనగ గింజలు నట్స్ ఇలాంటివి తినటం వల్ల ఆరోగ్యం.

Leave a comment