పండగలకి వేడుకలకి ధరించే పట్టు చీరెలు లెహంగాల పైకి కెంపులు, పచ్చలు, నీలాలు వజ్రాలు, ఆన్ కట్స్, తెల్ల రాళ్లు ఇలా భిన్నమైన రత్నాలు పొదిగిన బంగారు గాజులను ధరిస్తున్నారు అమ్మాయిలు. హారాలు నెక్లెస్ ల్లో ఎన్ని రకాల డిజైన్ లు ఉన్నాయో అవన్నీ గాజుల్ లోకి తెచ్చేసారు డిజైనర్లు ఇక పెళ్ళి నగల్లో అయితే సెట్స్ కి మ్యాచ్ అయ్యేలా టెంపుల్ నక్షి,పబి,  కుందన్ వర్క్ ల్లోనూ రాళ్ల గాజుల్ని  చేరుస్తున్నారు కొన్ని సన్నవి డిజైన్లు ఉంటే మరికొన్ని వెడల్పాటి కడాల్లాగా  ఉంటున్నాయి. రాళ్ల గాజుల అందానికి ఏవి సాటిరావు అన్నమాట నిజం రంగుల రత్నాల రాళ్ల గాజుల తో గ్రాండ్ గా కనిపించే మాట వాస్తవం.

Leave a comment