సత్ప్రవర్తనతో జీవించాలి అని పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. అసలు మానవుని ప్రవర్తన ఎలా ఉండాలి?ఎక్కడ నేర్చుకోవాలి అంటే ప్రకృతి లో ఉన్న సర్వప్రాణుల జీవిత విధానం చూసి నేర్చుకోవాలి.కొండచిలువ మాదిరిగా లభించిన దానితో తృప్తి పడాలి. సీతాకోకచిలుక లాగా పరులను ఇబ్బంది పెట్టకుండా మకరందాన్ని ఆశీర్వదించాలి అంటే భోజనం సంపాదించుకోవాలి తేనెటీగ తేనె కూడా పెట్టినట్లు ధర్మాన్ని కూడా పెట్టాలి లేడీ లాగా ఆకర్షణకు లోను కాకూడదు అత్యాశతో చేపల లాగా గాలానికి చిక్కు కోకూడదు పసిపాపల లాగా ఆకలి తీరిన వెంటనే సంతృప్తి పడాలి. శిల్పి ఏకాగ్రతతో విగ్రహాన్ని చెక్కినట్లు మనిషి తనను తాను శ్రద్ధతో ఎప్పుడు సమాజహితమైన  పనులనే తలపెట్టాలి.

చేబ్రోలు శ్యామసుందర్
9849524134

Leave a comment