2021లో చాలా మంది వ్యక్తులు తమ విజయాలతో తోటి వారిని ప్రభావితం చేశారు. చరిత్ర సృష్టించిన వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ కు చెందిన మేఘన ముసునూరి హైదరాబాద్ ఫౌంటెన్ హెడ్ గ్లోబల్ స్కూల్, జూనియర్ కాలేజీ వ్యవస్థాపకురాలు మంచి టీచర్ కూడా. ఈ సంవత్సరం గ్లోబల్ టీచర్ ప్రైజ్ అందుకున్నారు మేఘన రెండు వందల ఆరు కు పైగా దేశాల్లో ని ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే ఈ ప్రైజ్ కు షార్ట్ లిస్ట్ అయినా ఉపాధ్యాయుల్లో మేఘనా కూడా ఉన్నారు. హైదరాబాద్ కు చెందిన మేఘన సాంఘిక శాస్త్రం గణితం ఆంగ్లం బోధిస్తారు.