అరున్మల సద్య మనదేశంలోనే దేవాలయంలో వడ్డించే అతి పెద్ద శాఖాహార విందు. కేరళ లోని పేరున్న ఆలయాల్లో పార్ధసారధి దేవాలయం ఒకటి ఇక్కడ ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుపుతారు దీన్ని అరున్మల సద్య అంటారు.ఈ అన్నదానంలో 64 రకాల వంటకాలు వడ్డిస్తారు. ఆవకాయ,పెరుగు, పచ్చడి, సాంబారు, చిప్స్,పాయసం, కూరలు, స్వీట్లు తో సహా వుంటాయి. ముఖ్యంగా ఎన్నో ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన వెల్లం (నీళ్లు) ఇస్తారు. ఆలయ ప్రాంగణంలో అరటి ఆకుల్లో వడ్డించే ఈ అరున్మల సద్య ఎంతో గొప్ప విందు.

Leave a comment