టచ్ స్క్రీన్ లు, కీ బోర్డ్ లు, స్మార్ట్ ఫోన్ లు వచ్చాక ఏదైనా మెసేజ్, ఒక నిమిషం లో అవతల వారికి చేరిపోతుంది. మరింక అందమైన పెన్నుల చరిత్ర ఏమవ్వాలి ? అంటే నిక్షేపంగా ఉందీ అని చెప్పాలి. ఎంతోమంది వ్యాపారవేత్తలు, అధికారులు సెలబ్రిటీలు చిన్న సంతకం కోసం లగ్జరీ ఫౌంటెన్ పెన్నులు ఉపయోగిస్తూనే ఉన్నాయి .ఒక సర్వే ప్రకారం దక్షిణ భారతదేశంలోనే లగ్జరీ పెన్నుల వాడకం ఇటీవలే ఎక్కువయ్యాయని తెలుస్తోంది .కోటి రూపాయల ఖరీదు చేసే పెన్ను ఉంది తెలుసా ? లా మోడార్నిస్టా అనే పెన్ను రోడియం  కోటింగ్ తో బంగారపు పాళీ తో ఉంటుంది .ఖరీదు కోటి రూపాయలు అరోరా డయామంటే పెన్ను ఏడు కోట్లు .ఇంటో 2000 వజ్రాలు ఉన్నాయి.  కారన్ డాక్ డైమండ్ పెన్ను 850 వజ్రాలతో, పెన్నుమూత పైనే 26 లైన్ల బుగాటి కాట్ డైమండ్స్ తో ఐదు కోట్ల ఖరీదు చేస్తుంది.పెన్ను  మొత్తం బంగారం. హెవెన్ గోల్డ్ పెన్ 48 క్యారెట్ల వజ్రాల తో నిండి ఉంటుంది.ప్రముఖ బ్రాండ్ మాంట్ బ్లాక్ తయారుచేసిన పెన్ను పేరు మాస్టరీ మాస్టర్ పీస్. దీనిపైనే 840 వజ్రాలు అమర్చారు కొన్ని కెంపులు కూడా. ఖరీదు మూడు కోట్లు 96 లక్షల కంటే ఎక్కువే. కారన్ డాక్ గోతికా పెన్స్ రోడియం తో తయారు చేసినవి రెండు కోట్ల 20 లక్షలు.  ఖరీదు ను బట్టి స్టయిలూ, దాన్నిబట్టి గుర్తింపు ఉంటాయి. మేం సింగిల్ పీస్ అనుకునే మిలియనీర్లు ఇలాంటి పెన్నులను వాడుతుంటారు.  

Leave a comment