కళ్ళకు కాటుక పెట్టుకుంటే చూసేందుకు అందంగా ఉంటాదేమో కానీ బయట కొనే కాటుకలో ఉండే రసాయనాలతో కళ్ళకు ప్రమాదమే అంటారు కాస్మెటాలజిస్ట్ లు.  ఆముదం, నెయ్యి, కూరగాయలు, నూనె ఉపయోగించి ఇంట్లో చేసే కాటుకలో ఉండే విటమిన్-ఇ కంటికి మేలుచేస్తుంది. నెయ్యితో చేసే కాటుక కంటి చుట్టూ వలయాలు రాకుండా కాపాడుతుంది.కానీ బయట దొరికే కాటుకలో లెడ్, పి బి ఎస్,ఎఫ్ ఈ త్రీసంఖ్య జెడ్ ఎస్ ఓ వంటి భారీ లోహాలు ఎక్కువ ఉంటాయి. ఇవి శరీరంలో నిల్వ ఉండి  మెదడు ఎముక మూలుగ పైన దృష్ప్రభావం చూపిస్తాయి. కావాలనుకుంటే కంటి పైభాగం బయట ఐ లైనర్ పెట్టుకోండి కానీ కాటుక వద్దు అంటున్నారు నిపుణులు.

Leave a comment