ఫ్యాషన్ డిజైనర్ కావాలన్నదే నా డ్రీమ్ నిఫ్ట్ లో ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసి న్యూయార్క్ వెళ్లాను అక్కడ కాస్ట్యూమ్ డిజైనింగ్ విభాగంలో పనిచేసి హైదరాబాద్ వచ్చాక సొంతంగా దుస్తులు డిజైనింగ్ మొదలుపెట్టాను. 2012 లో మొదటిసారి లక్మే ఫ్యాషన్ వీక్ లో అవకాశం వచ్చాక ఇక వెనక్కి తిరిగే పనిలేకుండా పోయింది ఇక మహానటిలో దుల్కర్ సల్మాన్, సమంత, విజయ దేవరకొండకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాక వాటికి జాతీయ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డ్ వచ్చింది అంటుంది ఫ్యాషన్ డిజైనర్ అర్చన. 2013 లో వోగ్ ఫ్యాషన్ ఫండ్ గెలుచుకొని వోగ్ ఇండియా లో సభ్యత్వం పొందాను. నేను డిజైన్ చేసిన దుస్తులు ఎంతో మంది సెలబ్రెటీలు ధరించారు అంటుంది అర్చన సినిమాలకు దుస్తులు డిజైన్ చేస్తూ సరికొత్త ట్రెండ్ సృష్టిస్తోంది అర్చనా.

Leave a comment