దేశంలో మొదటి సారిగా తొలి జెండర్ పార్క్ కేరళలో రూపుదిద్దుకుంది. తిరువనంతపురంలోని కోజికోడ్ లో ఉన్న ఈ పార్క్ కోసం 24 ఎకరాలు కేటాయించారు. 2013 లో ప్లాన్ చేసి ఈ పార్క్ ఇటీవల ప్రారంభం అయింది. మహిళ వ్యాపారులు తమ ఉత్పత్తులు మార్కెట్ చేసుకునేందుకు ఇది మంచి వేదికగా నిలుస్తోంది. ఈ పార్క్ లో లైబ్రరీ, మ్యూజియం, నాటకశాల, కన్వెన్షన్ సెంటర్ ఉన్నాయి. ఈ పార్క్ ఏర్పాటుతో ముఖ్య భూమిక పోషించిన ఆరోగ్య శాఖ మాజీ మంత్రి కె.కె శైలజా పార్క్ గురించి మాట్లాడుతూ ఇది దేశంలో మొదటిదే కాదు ప్రపంచంలో మహిళా సంబంధిత నిర్మాణాల్లో పెద్దది మహిళా సాధికారతకు ఇది దోహదం చేస్తుందని అన్నారు.

Leave a comment