ప్రొఫెసర్ భారతి శంకర్ ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ కు ఎంపికయ్యారు దేవదాసీ దూరచారం పై ఎన్నో అధ్యయనాలు చేశారు. తన పరిశోధనా పత్రాలను నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలకు సమర్పించారు భారతి శంకర్. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ లో పి.హెచ్.డి చేశారు. జెండర్ స్టడీస్, పోస్ట్ కోలోనియల్ లిటరేచర్ వంటి పలు అంశాలపై పరిశోధన చేశారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో విమెన్ స్టడీస్ విభాగం ఐక్యూ ఏసీ డైరెక్టర్ గా ఉన్న భారతి ఒపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్, మహిళ సాధికారత పై కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వంటి అంశాలపై అధ్యయనం చేశారు.

Leave a comment