చికిత్స కు లొంగని కొన్ని కాన్సర్ లు ఉన్నాయి. అలాంటి అనారోగ్యం బారిన పడిన రోగులు చివరి దశలో చాలా ఇబ్బందులు పడుతారు. వారికీ ఉపశమనం కలిగించే పేలియేటివ్ కేర్ చికిత్స చేస్తారు గాయత్రి పాలట్. హైద్రాబాద్ లోని ప్రభుత్వ ఎం.ఎన్.జె కాన్సర్ హాస్పిటల్ లో పేలియేటివ్ సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయటంలో డాక్టర్ గాయత్రి కీలక పాత్ర పోషించారు. ఈ కేంద్రం ద్వారా చివరి దశలో ఉన్న కాన్సర్ రోగాలకీ వారి కుటుంబాలకు కూడా మనో ధైర్యాన్ని ఇస్తారు పెయిన్ రిలీఫ్ పేలియేటివ్ కేర్ సొసైటీలో కూడా గాయత్రి వ్యవస్థాపక సభ్యురాలు. నేషనల్ కాన్సర్ గిడ్ కు సలహాదారు ఆస్పత్రికి రాలేని వాళ్ళకు వెళ్ళి మరీ చికిత్స చేసేలా సిబ్బంది సౌకర్యాలు ఏర్పాటు చేశారు డాక్టర్ గాయత్రి.

Leave a comment